ఇంటర్నెట్ లో కిర్క్ గార్డ్ కారిడార్ వున్నట్లే గురజాడ వరండా కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడి పాఠకులూ చేరి కొంతసేపు తమకి తోచిన నాలుగు మాటలు మాట్లాడిపోతూ ఉండాలి.
ఎస్. రాయవరం
టాల్ స్టాయి ఆ నవల 1863 లో రష్యన్ లో రాసాడని మనం గుర్తుపెట్టుకుంటే, ఇరవయ్యేళ్ళు కాకుండానే ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదం మహారాజా ఆనంద గజపతీ, గురజాడ అప్పారావూ చదువుతున్నారంటే, వాళ్ళ ప్రపంచం ఎంత విశాలమో మనకి బోధపడుతుంది.
మరొకవందేళ్ళపాటు నిలిచే నాటకం
కన్యాశుల్కానికి నేటి పోస్ట్ మోడర్న్ సమాజంలో ఎంతో ప్రాసంగికత ఉంది. ఆధునిక యుగంలో పబ్లిక్ మాత్రమే పొలిటికల్ గా ఉండేది. కాని ఆధునికానంతర సమాజలో ప్రతి ఒక్కటీ , చివరికి ప్రైవేట్ కూడా పొలిటికలే. ఆ రకంగా కన్యాశుల్కం గొప్ప రాజకీయనాటకం.