ఆయన చెప్పిన నిర్వచనం ప్రకారమే చూస్తే, ఇది కేవలం ఋషి లక్షణం మాత్రమే కాదు, దైవలక్షణం కూడా. ఇవ్వడమే, ఎటువంటి ప్రతిఫలాపేక్షా లేకుండా ఇవ్వడం మాత్రమే తెలిసినవాణ్ణి దేవుడంటారనే కదా ఆయన చెప్పింది!
మేలిమి సభలు
ఆ రోజు అచ్చంగా ఆరుగురమే ఉన్నాం. అది నా జీవితంలో నేనింతదాకా హాజరైన కవిత్వావిష్కరణ సభల్లో మరీ మేలిమి సభల్లో ఒకటని మరో మారు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
