జీవనరోచిష్ణుత

ఒక కవికీ, రచయితకీ అతడు రాసిన పుస్తకం ఒక సహృదయుడు చదివి మనఃపూర్వకంగా ప్రశంసిస్తే అంతకన్నా మించిన సత్కారం మరొకటి ఉండబోదు. అయితే ఆ సహృదయుడు కేవలం సాహిత్యాభిమాని మాత్రమే కాక, సాహిత్యవేత్త, ఉత్తమ సాహిత్యప్రమాణాలకు గీటురాయి వంటివాడు అయితే, ఆ సత్కారం కన్నా మించిన సత్కారం మరొకటి ఉండబోదు.

ఎర్రాప్రగడ

ఇప్పుడు ఏ మిగలముగ్గిన తాటిపండుని చూసినా ఎర్రాప్రగడ గుర్తుకు వస్తాడు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టుమీదే పండి చుట్టూ గాలిని సురభీకరించే తాటిపళ్ళు గుర్తొస్తాయి.

అచ్చమైన తెలుగు కవిత్వం

ఒకప్పటి పాకనాటిసీమ పల్లెటూరి జీవితం, ఆ రైతులు, గోపాలకులు, ఆ పశువులు, ఆ అడవులు, ఆ పొలాలు, ఆ సంతోషాలు, ఆ భయాలు అవన్నీ మొదటిసారి తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాయి. ప్రాజ్ఞన్నయ యుగంలో శాసనాలకు పద్యాల్ని ప్రసాదించిన గుండ్లకమ్మ ఒడ్డున ఇప్పుడు మట్టివాసనలీనే అచ్చమైన తెలుగు కవిత్వం ప్రభవించింది.