నిర్బంధం ఒక జీవనశైలిగా మారిపోయేక

న్నిటికన్నా ముందు, ఆ పురాతన గ్రామం, ఆకుపచ్చని దిగంతం వైపు మెలికలు తిరుగుతూ సాగిపోయే రహదారీ, పత్రహీన పోప్లార్ తరుకాండాలు- ఆ లాండ్ స్కేప్ చూస్తుంటే ఆంటోనియో మచాడో కవిత్వం చదువుతున్నట్టే ఉంది