ఇదిగో లోకానికి ఇది నా లేఖ

ఎమిలీ డికిన్ సన్ ని అనువదించడం కష్టం కాదు, దాదాపుగా దుస్సాధ్యం. ఎందుకంటే, ఆ విలక్షణమైన ఇంగ్లీషుని ఇంగ్లీషులోకి అనువదించడమే కష్టం, ఇక తెలుగులోకి తేవడం ఎట్లా? కాని సరోజిని గారు ఆ నిశ్శబ్ద్దాన్ని, ఆ వైశిష్ట్యాన్ని, ఆ మృదూక్తిని, ఆ అర్థోక్తిని ఎంతో సరళంగా అనుసృజించుకున్నారు.

మంత్రమయవాణి

ఆ ప్రభుదర్శనం ఆమె స్వయంగా సాధించుకున్నది, ఆమె సొంతం. తనకీ, తన దేవుడికీ మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదామెకి. ఒక తోటతోనూ, తోటలో పాడే ఒక పిట్టతోనూ ఆమె నేరుగా స్వర్గానికి ప్రయాణించగలదు.

నిజమైన ఆస్తికురాలు

ఒక తేనెటీగలో భగవద్విలాసాన్ని చూడగలిగిన దార్శనికురాలు. సదా సంశయంతో, మృత్యువుతో తలపడుతూ, ఎప్పటికప్పుడు ఒక పక్షి కూజితంతోనో, ఒక వింతవెలుగుతోనో ఆత్మ అనశ్వరత్వాన్ని ప్రకటిస్తూ వచ్చిన నిజమైన ఆస్తికురాలు.