ఒక భాష బృహద్భాషగా పరిగణించబడాలంటే ఆ భాషలో గొప్ప సాహిత్యం వచ్చి ఉండాలనేది మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. కాని, మనం కొత్తగా చెప్పుకోవలసిందేమంటే, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగాపెరుగుతూ వస్తేనే ఆ భాష ప్రపంచభాషగా మారుతుందనేది