సాంస్కృతిక రాయబారి

ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల పట్ల ఆమె అధికారం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆమె మనోవేగంతో సాహిత్యప్రశంస చెయ్యగలరు. ఏ సాహిత్య విశ్లేషణలోనైనా మనం చివరి మాట చెప్పాం అనుకున్నప్పుడు, ఆ తర్వాత మాట ఆమెదే అవుతుంది.

ముప్పై ఏళ్ళల్లో

తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి ముఫ్పై ఏళ్ళయిన సందర్భంగా, ముఫ్ఫైఏళ్ళ (1985-2015) తెలుగు సాహిత్యం మీద ఒక గోష్టి ఏర్పాటు చేసారు. అందులో కీలకప్రసంగం చేయవలసిందిగా మృణాళిని నన్నడిగారు.