అసలు ముందు ఆ ముఖచిత్రం దగ్గరే నేను చాలాసేపు ఆగిపోయాను. ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ఫొటో! లేపాక్షి శిల్పమంటపంలో కూచుని స్కెచ్ బుక్కు తెరిచిపెట్టుకుని ఒక బొమ్మ గియ్యడానికి ఉద్యుక్తుడవుతూ తన ఎదట ఉన్న శిల్పాన్ని పరికిస్తున్న్న ఆ చిత్రకారుణ్ణి చూసి ఏ కళాకారుడు మోహపడడు కనుక!
బుచ్చిబాబు
ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యులైన రచయితల్లో ఒకరైన బుచ్చిబాబు అంతరంగ కథనం నుంచి కొన్ని ఆలోచనలను పంచుకుంటూ ఆయన సాహిత్యదృక్పథాన్ని వివరిస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు ఆకాశవాణి, హైదరాబాదు వారికోసం చేసిన ప్రసంగం.
సాహిత్యం ఏం చేస్తుంది?
అటువంటి దృక్పథాన్ని తనకై తాను ఏర్పరచుకునే క్రమంలో బుచ్చిబాబు కథానికా ప్రక్రియ గురించీ, కథకుడి అంతరంగం గురించీ కూడా కొంత అనుశీలన చేసాడు. కొత్తగా కథలు రాస్తున్న రచయితలకీ, చాలా కాలంగా రాస్తున్న రచయితలకీ కూడా ఆ అనుశీలన కొంత అంతర్దృష్టిని ప్రసాదిస్తుంది.
