అతడు తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో దర్శించడానికి ప్రయత్నించాడు. అలా చూడటంలో అతడు రంగుల్ని చూశాడు. రాగాలు విన్నాడు. అవి స్పష్టంగా స్పెయిన్ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.