కథల సముద్రం-2

ఈ అపురూపమైన సాహిత్యభాండాగారాన్ని తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్న కుమార్‌ కూనపరాజుగారికి తెలుగు సాహిత్యలోకం సదా ఋణపడి  ఉంటుంది. ఇప్పటికే డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్‌ సోదరులు నవలను ప్రశంసనీయంగా అనువాదం చేసిన అరుణా ప్రసాద్‌ ఈ కథల్ని అనువదించడం తెలుగు కథకులకు ఊహించని వరం.

కథల సముద్రం-1

జీవితాన్ని ఒక కథకుడు ఎలా సమీపించాలి, తన అనుభవాన్ని కథగా ఎలా మలచాలి, ఎలా ఎత్తుకోవాలి, ఎలా నడపాలి, ఎలా ముగించాలి వంటివన్నీ చెహోవ్‌ కథల్ని చదివే ఇరవయ్యవ శతాబ్ది కథకులు నేర్చుకున్నారు. మనకి కూడా అదే దగ్గరి దారి.

ఉసిరికాయలు

మనిషికి కావలసింది ఆరడుగుల నేలనో లేదా చిన్నపాటి సుక్షేత్రమో కాదు. అతడికి మొత్తం భూగోళం అవసరం కావాలి, మొత్తం ప్రకృతి కావాలి, తనలోని స్వేచ్ఛాజీవి తన కౌశల్యాల్ని, అద్వితీయతల్ని మొత్తం బయటకు తేవడానికి అవసరమైన అవిరళ ఆకాశం కావాలి