అత్తలూరి నరసింహారావు

ఇన్నేళ్ళ పరిచయంలోనూ, స్నేహంలోనూ ఆయన నా మనసుని నొప్పించే మాట ఒక్కటి కూడా ఆడకపోగా తనకన్నా వయసులో చిన్నవాణ్ణి అయినప్పటికీ, ఎంతో గౌరవంగా, హుందాగా, స్నేహంగా ప్రవర్తిస్తూనే వచ్చాడు.

దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.

అజంతాగారు

అట్లాంటి రోజుల్లో విజయవాడ వెళ్ళినప్పుడు, జగన్నాథ రావుగారు నన్నొక హాస్పటల్ కి తీసుకువెళ్ళారు. అక్కడొక బెడ్ మీద పడుకుని ఉన్న బక్కచిక్కిన మనిషిని చూపిస్తూ 'ఈయనే అజంతా గారు' అన్నారు. ఆ బెడ్ మీద ఆయన పక్కనే ఒకటిరెండు కవిత్వపుస్తకాలు ఇంగ్లీషులో.