'వట్టి నవల మటుకే కాదు, అది కథలాగా, కావ్యంలాగా, నాటకంలాగా కూడా ఉండాలి,అట్లాంటి రచన ఒకటి రాయాలనుకుంటున్నాను 'అని చెప్పాడట టాల్ స్టాయి 'వార్ అండ్ పీస్' నవల రాయబోతూ. టోనీ మారిసన్ నవల Beloved (1987) ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికొక వార్ అండ్ పీస్, ఒక ఒడెస్సీ, ఒక పారడైజ్ లాస్ట్.
రాల్ఫ్ ఎల్లిసన్
ఈ వ్యాసాలు మొదలుపెట్టినప్పుడు Invisible Man గురించి కూడా రాస్తున్నావు కదా అని కన్నెగంటి రామారావు అడిగినప్పటినుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను, ఒక చిన్న పరిచయంలో ఆ నవలకు న్యాయం చేయగలనా అని. ఒక వ్యాసం కాదు, ఒక గోష్టి కావాలి
మాయా ఏంజెలొ
ఆఫ్రికన్-అమెరికన్ రచయితలందరిలోకీ, అత్యంత ఆత్మీయంగా అనిపించే రచయిత్రి ఎవరంటే మాయా ఏంజెలొ పేరే చెప్తాను. ఆమె రాసిన Letter to my daughter (2008) చదివినప్పుడే నిజమైన విద్యావంతురాల్ని, సంస్కారవంతురాల్ని, జీవితప్రేమికురాల్ని చూసిన సంతోషం నాకు అనుభవానికి వచ్చింది.