21 వ శతాబ్దంలో విద్య

నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఇన్ స్టిట్యూట్స్ ఛైర్మనూ, మిత్రులు ప్రసన్నకుమార్ గారు, తమ సంస్థ వ్యవస్థాపకదినోత్సవంలో కీలక ప్రసంగం చెయ్యమని ఆహ్వానించేరు. నిన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాదు లో జరిగిన ఆ సమావేశానికి ప్రసిద్ధ గాంధేయవాది, అసొసియేషన్ ఫర్ వాలంటరీ అసొసియేషన్స్ ఫర్ రూరల్ డవలప్ మెంట్( అవర్డ్) అధ్యక్షుడు పి.ఎం.త్రిపాఠి ముఖ్య అతిథి.