గడిచిన రెండువారాలుగా నేను జాతకకథల చుట్టూ పరిభ్రమిస్తున్నాను. తెలుగులో, ఇంగ్లీషులో, బయట, నెట్ లో ఎక్కడెక్కడ ఏ అక్షరం దొరికినా ఆతృతతో అల్లుకుపోతున్నాను.
యక్షప్రశ్నలు
ఒక ప్రక్రియగా పొడుపుకథల గురించి ఆలోచిస్తూ ‘యక్షప్రశ్నలు’ మరొకసారి చదివాను. ఒక మహేతిహాసంలో ఆ సంఘటనని ఆ విధంగా conceive చేయగలగిన భారతకారుడి ప్రజ్ఞకు మరోసారి నిలువెల్లా నివ్వెరపోయాను. గొప్ప సాహిత్యం మనకి ప్రతి సారీ కొత్తగా కనిపించినట్టే, యక్షప్రశ్నలు కూడా మళ్ళా మరోసారి కొత్తగా కనిపించి కొత్త ఆలోచనలు నాలో సుళ్ళు తిరిగేయి.
దేహాల సుగంధం
సాదత్ హసన్ మంటో రాసిన 'బూ' కథని ఆయన సమకాలికుడైన ఒక అభ్యుదయ రచయిత విమర్శించాడు. ఈ కథ సాధించగల సామాజిక ప్రయోజనమేమిటని అడిగాడు. కాని ఈ కథ నేను చదివిన అత్యంత కవితాత్మకమైన కథల్లో ఒకటి.
