1861-65 మధ్యకాలంలో సంభవించిన అమెరికా అంతర్యుద్ధంనుంచి ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం (1954-68) మధ్యకాలంలో దాదాపు ఒక శతాబ్దం పాటు ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర గతికి విలియం ఎడ్వర్డ్ డుబ్వా (1868-1963) జీవితం నిలువెత్తు దర్పణం.
పాల్ లారెన్స్ డన్ బార్
19 వ శతాబ్ది చివరిలోనూ, ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనూ తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు (1862-1915) నిర్వహించిన పాత్ర వంటిది, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంలో ఎవరు నిర్వహించారని చూస్తే, ఇద్దరు రచయితలు కనిపిస్తారు. ఒకరు, పాల్ లారెన్స్ డన్ బార్ (1872-1906) మరొకరు, విలియం ఎడ్వర్డ్ డుబ్వా (1868-1963).
ఒక బానిస ఆత్మకథ
ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంతో పరిచయం కావాలనుకున్నవాళ్ళు తెరవవలసిన మొదటి పుస్తకం ఫ్రెడరిక్ డగ్లస్ (1817?-1895) రాసిన Narrative of the Life of Frederick Douglass, an American slave (1845) అని అనడంలో సందేహం లేదు. ఆ పుస్తకం చదివినవాళ్ళకి అతడి పుట్టినరోజు నేడు నల్లజాతి చరిత్ర మాసోత్సవానికి ప్రాతిపదికగా ఎందుకు మారిందో అర్థమవుతుంది.
