డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాసిన You are Born to Blossom గ్రంథానికి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం 'ఈ మొగ్గలు వికసిస్తాయి'(2009).
ఎవరికీ తలవంచకు
సరాసరి తన హృదయాని చీల్చుకు వచ్చే సరళవాక్యాలతో జాతి జీవితం పట్ల తన మమేకత్వాన్ని మనతో కలాం పంచుకోవడం ఈ పుస్తకం సారాంశం. మానవ, జాతీయ, గ్లోబల్ అంశాలెన్నిటిపైనో కలాం మదిలో చెలరేగిన భావాల సమాహారం ఈ పుస్తకం. సరాసరి మన ఎదురుగా నిలబడి మన కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుండే మంత్రమయవాక్యాల సంపుటం ఈ పుస్తకం.
ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం
'ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం' డా. కలాం, ఆచార్య మహాప్రజ్ఞ అనే జైన సాధువుతో కలిసి రాసిన The Family and the Nation కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం.
