జూకంటి జగన్నాథం ముఫ్ఫై ఏళ్ళకు పైగా నా మిత్రుడు. నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతానికి వచ్చిన మొదటి మనియార్డరు అతణ్ణుంచే. ఇప్పటిదాకా అచ్చయిన తన ప్రతి కవితా సంపుటీ నాకు పంపిస్తూ ఉన్నాడు, మూడు సమగ్ర సంపుటాలతో సహా.
యుద్ధమా? ఇక ఏమి లోకము
విక్టర్ ఫ్రాంక్ రాసిన Man's search for Meaning (1946) ని అల్లు భాస్కరరెడ్డిగారు 'అర్థం కోసం అన్వేషణ' పేరిట తెలుగులోకి అనువాదం చేసారు. ప్రొ.అడ్లూరి రఘురామరాజుగారు గారి సంపాదకత్వంలో ఎమెస్కో సంస్థ 'పొరుగునుంచి తెలుగులోకి 'పేరిట వెలువరిస్తున్న పుస్తకమాలికలో 30 వ ప్రచురణగా ఇటీవలనే వెలువడింది.
ఆధునిక తెలుగుశైలి
ఈ నెల 17 వ తేదీ బుధవారం విజయనగరంలో డా. ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తిగారి రచన 'ఆధునిక తెలుగు శైలి ' పుస్తకాన్ని గురజాడకీ,గిడుగుకీ అంకితమివ్వడం కోసం ఏర్పాటు చేసిన సభ. వారి తరఫున మండలి బుద్ధప్రసాద్ గారు స్వీకరించారు. గొల్లపూడి మారుతీరావుగారు అధ్యక్షత వహించిన ఆ సభలో ఆ పుస్తకం మీద నేను మాట్లాడాలని నరసింహమూర్తిగారి కోరిక.
