మరొక నూరేళ్లు బతకాలనిపిస్తున్నది

జీవితం చాలా విలువైంది. ప్రతి క్షణం ఎంతో విలువైంది. మరొకసారి ఈ భాగ్యం మనకు దక్కుతుందో లేదో తెలియదు. ఎన్ని కష్టాలు, ఎన్ని క్లేశాలు, ఎంత దుఃఖం, ఎంత వేదన ఉండనీ, ఈ ప్రపంచంలో పుట్టడమే గొప్ప భాగ్యం.

ఒక కవిత నీ ఇంటి తలుపు తట్టకపోతే

నా హృదయం కూడా లోతైనదే. కాని ప్రతిఫలించవలసిన ఆ ప్రతిబింబం ఏదీ? ఆ పూర్వకాలపు రాకుమారుడిలాగా, నాకు కూడా ఒక కవిత దొరికితే తప్ప, ఇక్కడి నా బస నివాసంగా మారదు.

ఒక తేనెటీగకి ఎంత గూడు కావాలి?

నాకు ఇల్లొక్కటే చాలదు, పుస్తకాలు కావాలి, ప్రతి సాయంకాలం, ఇంటి అరుగుమీద, ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోడానికి ఒక మిత్రబృందం కావాలి. మేము మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి వచ్చిన నక్షత్రాలతో ఆకాశం కిక్కిరిసిపోవాలి.

Exit mobile version
%%footer%%