
ఒక రాత్రి నామదేవుడితో కలిసి పాండురంగడు తుకారాం కలలో అడుగు పెట్టాడు. అతడి ముందు తక్కెడ చాపాడు. ఒకవైపు సిబ్బెలో నామదేవుడు కోటి కీర్తనలు పోగు పోశాడు. ‘అయినా ఇంకా బాకీ తీరలేదు, మిగిలిన పాటలు నువ్వు పాడు’ అని అన్నాడట విఠలుడు తుకారాముతో.
పొద్దున్న ఆ పుస్తకాల షాపు లో
అడుగుపెట్టానో లేదో
నా మీద వలవిసిరింది మామిడి చెట్టు.
ఊపిరి ఆడనివ్వకుండా
ఒళ్లంతా వెయ్యి చేతులతో
చుట్టేసింది పుప్పొడి.
ఏదీ! ఇప్పుడొక కవిత రాయి
అని అడిగావు నువ్వు.
తేరుకోవడం చాలా కష్టమైంది.
నీకు తెలుసు కదా
నేనీ సంతోషాన్ని
స్వీకరించే స్థితిలో లేనని.
ఇంకా ఏ పాటలు
మిగిలిపోయాయని
ప్రభో!
నువ్విట్లా
నా మెలకువ లోనే
నా వెంటపడుతున్నావు?
2-2-2024


మెలకువ లో వెంట బడటం… అద్భుతం అండీ
ధన్యవాదాలు మేడం
🙏
ధన్యవాదాలు సార్
“ఊపిరి ఆడనివ్వకుండా వేయి చేతులతో చుట్టేసింది పుప్పొడి”… చాల బాగుంది సార్ 🙏
ఏమనలేను! మూగనయ్యాను! స్వామి కరుణిస్తే అంతే!🙏
ధన్యవాదాలు సార్
మరోవైపు సిబ్బెలో ఏముంది గురువుగారు.. నామదేవుడి కీర్తనలో పాండిత్యము తప్ప భక్తి లేదా!? 🤔
మరొక సిబ్బె తుకారాము కోసం
🙏ధన్యవాదాలు గురువుజీ.. భగవంతుడు ఇలా భక్తులకు కవులకు బాకీ పడటం వల్లే కనిపించకుండా తిరుగుతున్నాడు ☺
వలవిసిరిన మామిడి చెట్టు painting and poem are beautiful, సర్ 🙏🏽
ధన్యవాదాలు మాధవీ