
సాయంత్రం అయిదు. వీథుల్లోనూ
ఇళ్ళమీదా, చెట్లమీదా ఎండ చార.
బాల్కనీలో నిలబడ్డాను. నాచుట్టూ
రగులుతున్నది వేడికాదు, పూలతావి.
విరిగిన ఇనుపముక్కల్లాగా ఎప్పటినుంచో
మనసులో ఇరుక్కున్నవెన్నో వ్యథలు
ఆ పరిమళస్పర్శకి పూచికలాగా రాలిపడ్డాయి
వైద్యుడు లేకుండానే మందు దొరికింది.
కొంతసేపటికి చంద్రుడొస్తాడు. చైత్రమాసపు
తీపిగాలికి పాలసముద్రపు జిడ్డు తోడవుతుంది
రాలిపడ్డ పూలరేకలదే ఈ రోజు యుద్ధంలో
పైచేయి. రేపటి సంగతి చెప్పలేను.
31-3-2026


మీ ప్రతి పదం అద్భుతం. ఆశ్చర్యం
ధన్యవాదాలు మేడం
Every word, every thought, every stroke oozing beauty!! ❤️🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
నిజమే సర్..
ఆ పూల పరిమళ స్పర్శ..
మురిపిస్తుంది..
మరిపిస్తుంది… ఆ కాసేపైనా..
ధన్యవాదాలు