
పండుగుమ్మడికాయమీద
పరుచుకున్న పూతలా
ఫిబ్రవరి సూర్యకాంతిమీద
పలచని మంచుపొర.
ఇప్పుడు చెట్లు తమని తాము
రిక్తం చేసుకునే కాలం.
ఒకప్పుడు పూలు విరజిమ్మినట్టు
ఇప్పుడు ఆకులు రాలుతున్నాయి.
నేనూ ఇంతే కద!
ఒకప్పుడు గుండెబరువెక్కి
కవితలు రాసుకునేవాణ్ణి.
ఇప్పుడు! మనసు తేలికపడి.
12-2-2026


చాలా బాగుంది సార్
ధన్యవాదాలు సార్!
Beautiful sir ❤️
ధన్యవాదాలు మానసా!
ధన్యవాదాలు మానసా!