
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశ కావ్యం గురించి ఇది ఎనిమిదవ ప్రసంగం. ఇప్పటిదాకా 40 శ్లోకాలు, అంటే, కావ్యంలో మూడవవంతు పూర్తయింది. ఇవాళ 41-49 దాకా శ్లోకాల గురించి నా భావాలు పంచుకున్నాను. ఈ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
Featured image: Photo by David Riaño Cortés
1-8-2025


Sir, I am so happy that I was able to catch this talk live.
పావురాలు నిద్రిస్తుండే సౌధాలు అన్న కవిసమయం గురించి చెప్పి,
ఆ శ్లోకంలోని అంతరార్థాన్ని చెప్పినందువల్ల ఆ శ్లోకాన్ని మరింత appreciate చేయగలిగాము.
Bhartṛuhari రాసిన వైరాగ్య శతకం లోని ఆ శ్లోకం కదిలించింది – ఒక లాంటి బాధ కలిగింది ఆ పతన వర్ణన విని. But tells us the impermanence of life and such is nature!!
పౌరాణిక పాత్ర అయిన కుమార స్వామిని కావ్య నాయకుడిని చేయడం, వాల్మీకి చేసిన వర్ణన ని (పూలు పూసిన కొండలా హనుమంతుడు) తర్వాతి కవులు adopt చేసుకోవడం, నెమలి పింఛాన్ని అమ్మవారు కర్ణాభరణంగా ధరించడం and the detail in all these slokas,
కాళిదాసు మీద తమిళ సాహిత్య ప్రభావం!!
ఎన్నెన్నో విషయాలు చెప్పి కావ్యానందాన్ని ఇనుమడింప చేశారు!!
Thank you! 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! నిన్న మిమ్మల్ని చూసి నాకు కూడా చాలా సంతోషం కలిగింది!