పుస్తక పరిచయం ప్రసంగ పరం పరలో భాగంగా ఈ రోజు 'స్వప్నలిపి' కావ్యం మీద ప్రసంగించాను. ఇది కిందటి వారం ప్రసంగానికి కొనసాగింపు.
ఎర్రపూల చెట్టు
మొన్న నేను నా గేయం 'ఎర్రపూల చెట్టు'ని ఎవరూ స్వరపరిచి గానం చెయ్యడం లేదు కాబట్టి నేనే ఏ.ఐ సహాయంతో ట్యూను చేసుకున్నానని పెట్టిన వీడియో ఆమె చూసారు. అపారమైన సహృదయతతో ఆమె ఆ గేయాన్ని తానిట్లా స్వరపరిచి పాడి నాకు పంపించారు. ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశీస్సులు కూడా.
నగరం పుట్టకముందు నగరం
నడివేసవి వెన్నెల రాత్రి. హటాత్తుగా పెద్దవర్షం. కరెంటుపోయింది. నగరానికి అడవి దగ్గరగా జరిగేదిలాంటప్పుడే.
