
వానాకాలంలో పొంగిపొర్లే ఏటిలాగా
ఉరకలెత్తుతున్న వసంతం.
నా కళ్ళముందే కొట్టుకుపోతున్నవి
కాలం, గగనం, నగరం.
ఇన్నేళ్ళ జీవితం తరువాత గ్రహించాను
రెండు దారులున్నాయని:
ఒకటి, నలుగురితో కలిసి నడిచే దారి
మరొకటి పూలదారి.
ఏళ్ళమీదట అభ్యాసం చేసాక ఇప్పటికి
సాధ్యం చేసుకోగలిగాను
కోకిల పిలుపు ఆకుల గలగల తప్ప
మరొకటి వినబడని విద్య.
ఎవరిని చూడు: ప్రతి ఒక్కరూ ప్రపంచం
కైవసం కావాలనుకునేవారే.
నాది చాలా చిన్న కోరిక, స్వర్గాన్ని
కళ్ళతో తాగితే చాలనుకుంటాను.
పూసి, పూసినంతలోనే రాలిపోతున్నవి
పచ్చసుంకేసుల పూల రాశులు-
ఒక్కరోజు బతగ్గలిగినా చాలు నువ్వట్లా
ఈ వసంతం నీదని చెప్పుకోవచ్చు.
2-4-2025


‘పూలదారుల’ వెంట గమనం
‘ఆకుల గలగలలు, కోకిల పిలుపులు’ మాత్రమే వినగలిగిన విద్య మీదైనప్పుడు
పయనమా, గమ్యమూ కూడా స్వర్గమే కదా !!
🙏🏽🙏🏽🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
బాగుంది సార్
ధన్యవాదాలు సార్!
ఎంత అందమైన భావగర్భిత కవితనో .
ధన్యవాదాలు సార్!
We walk on hell gazing at flowers..గుర్తొచ్చింది.
నలుగురూ నడవని దారి ముళ్ళ దారి అని, రాళ్ళ దారి అని అనే లోకంలో ఒక్క మా కవి మాత్రమే కదా ఆ నడవాల్సిన రెండో దారి పూల దారి అని చెప్తోంది..❤️
Sir… మేమూ కళ్ళతోనే తాగుతున్నాం ఇక్కడ స్వర్గాన్ని. ❤️
ఒక కవితని ఎలా చదవాలో, దేనితో కలిసి చదవాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ మైమర్చిపోవాలో తెలిసిన పాఠకులే పాఠకులు.
నేను మాత్రం
ప్రతి రోజూ కూసే వసంత కోయిలను,
ప్రతి రోజూ పూసే మావిపూతనూ
కనుగొన్నాను…. ఈ కుటీరంలో
🙏🙏🙏💐💐
ధన్యవాదాలు సార్
‘ఇన్నేళ్ళ జీవితం తరువాత గ్రహించాను
రెండు దారులున్నాయని:
ఒకటి, నలుగురితో కలిసి నడిచే దారి
మరొకటి పూలదారి.’
జీవిత సత్యాలను సున్నితంగా అందంగా చెప్పారు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్!