పుస్తక పరిచయం-13

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా టాగోరు కవిత్వం గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాం. కిందటి వారం ప్రసంగంలో 1890-1900 మధ్యకాలంలో టాగోరు రాస్తూ వచ్చిన కవిత్వం గురించి, ఆ నేపథ్యం గురించీ ప్రసంగించాను. ఆయన మొదటిదశలో రాసిన కవిత్వంలోనే కాక, మొత్తం కవిత్వంలోనే సర్వోన్నతమైనదని చెప్పదగ్గ ‘ఊర్వశి’ కవిత గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ రోజు ‘వనమాలి’ (1913) లో కవిత్వం గురించీ, ముఖ్యంగా ‘చిత్రాంగద’ (1892) రూపకం గురించీ ప్రసంగించాను. ఈ ప్రసంగం వినడానికి ఈ లింకు తెరవచ్చు.

రవీంద్రుని నాటకం చిత్రాంగదకు అబ్బూరి రామకృష్ణారావుగారి తెలుగు అనువాదం చదవడానికి ఈ లింకు తెరవచ్చు. ఇక్కడనుండి పిడిఎఫ్ డౌనులోడు చేసుకోవచ్చు.

చిత్రాంగద నాటకం బెంగాలీనుంచి లోపాముద్ర బెనర్జి ఇంగ్లిషులోకి చేసిన అనువాదం చదవడానికి, ఆ వీడియో చూడటానికి ఈ లింకు తెరవచ్చు:

చిత్రాంగద నాటకానికి టాగూరు చేసుకున్న ఇంగ్లిషు అనువాదం ఇక్కణ్ణుంచి డౌన్లోడు చేసుకోవచ్చు:


Featured image: Spring, photograph by Venu Challa.

28-3-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading