అటువంటి పుస్తకం ఉందనే తెలుగువారిలో చాలామందికి తెలియదు. అటువంటిది రెవెన్యూ శాఖలో తహశీల్దార్ గా పనిచేసి రిటైర్ అయిన మహమ్మద్ సిలార్ అనే పండితుడు తెలుగులోకి అనువదించడం, ఆ పుస్తకాన్ని లీలా అజయ్ గారు తాను స్వయంగా ప్రచురించి ఆవిష్కరణ సభ ఏర్పాటు చెయ్యడం నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి.
ప్రేమభాషా కవి
యుద్ధమధ్యంలో, 'మండే ఇసుకలో నెత్తురోడుతో డేక్కుంటో ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కి వెళ్ళవలసిన జీవితం మధ్య' వాళ్ళు ప్రేమకోసం, శాంతికోసం తపించారు. సుఖంగా, సౌకర్యంగా జీవిస్తో మనం మన భాషని 'ద్వేష భాష' గా మార్చుకుంటున్నామని తెలియవలసి రావడంలో ఉన్న విషాదం చెప్పలేనిది.
తెల్లవారకుండానే
తెల్లవారకుండానే పక్షులు చెట్టుతో పాటు నన్నూ లేపుతుంటాయి అప్పుడు నేనొక తల్లిగా మారిపోతాను.
