చలంగారి సుశీల

సుశీలకి సులేమాన్ తో కలిగిన ప్రేమానుభవం, టాగోర్ మాటల్లో చెప్పాలంటే, గ్రీకు నగరం స్పార్టా అభిలాషలాంటిది. అది సంకుచితం. వారిద్దరికే పరిమితం. నిజానికి అక్కడ ఇద్దరికి కూడా చోటు లేదు. అది ఇద్దరు ఒకరిగా మారి, చివరికి ఏ ఒక్కరూ మిగలని బాధానుభవం. నారాయణప్పతో ఆమెకి ఆ తరువాత సంభవించింది ఏథెన్సు నగరానికి సంభవించినటువంటిది. అది ప్రేమ తాలూకు అత్యున్నత స్థాయి.

ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును

దాంపత్య సంబంధాల్లోగానీ, కుటుంబసంబంధాల్లో గానీ, సమస్య ఎక్కడొస్తుందంటే మనం ప్రేమనివ్వకుండా, ఎదుటివాళ్ళనుంచి ప్రేమని ఆశించడం వల్ల. అక్కడితో ఆగకుండా డిమాండ్ చెయ్యడం వల్ల. అలాగే మనం ప్రేమనిలపకుండా, ఎదుటివాళ్ళు నిలపాలని కోరడం వల్ల.

ముందుయుగం దూత

అంతర్జాతీయమార్కెట్‌ మీద నువ్వు తిరుగుబాటు ప్రకటించాలనుకుంటే అందుకు నీదైన జీవనశైలిని నువ్వు నిర్వచించుకోవాలి, నీ సౌందర్యదృక్పథాన్ని నువ్వేర్పరచుకోవాలి, నీ నమూనాల్ని నువ్వు రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మార్కెట్లను నువ్వు జయించగలుగుతావు.