ఆషాఢమేఘం-10

తమిళదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చెయ్యడంలో సంగం కవులు, భావుకులు చూపించిన ఈ వివేకం, ఈ ప్రజ్ఞ ఎంత బలమైనవంటే, తర్వాత రోజుల్లో నాయనార్లకీ, ఆళ్వార్లకీ ఈ రసజ్ఞతనే పాదుగా నిలబడింది. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా తమిళుల్ని ప్రాంతీయ భేదాలకు అతీతంగా దగ్గరగా నిలబెడుతున్న జీవజలాలు సంగం సాహిత్యం నుండి ఊటలూరినవే.