ప్రతి మీనియేచర్ చిత్రలేఖనంలోనూ కనవచ్చే ఆ రంగులు, ఆ రేఖలు, ఆ లలితసుందరమైన భావోద్వేగమూ చూడగానే మనల్ని సమ్మోహపరచడం మనకి అనుభవమే కదా. అకనానూరు కవితల్లో కూడా ఆ రంగులు, ఆ రేఖలు కలిసి సున్నితంగా చిత్రించే రసరమ్యలోకం అనువాదాల్ని కూడా దాటి ప్రయాణించగలిగింది అని మనం గ్రహిస్తాం.
