సుశీలకి సులేమాన్ తో కలిగిన ప్రేమానుభవం, టాగోర్ మాటల్లో చెప్పాలంటే, గ్రీకు నగరం స్పార్టా అభిలాషలాంటిది. అది సంకుచితం. వారిద్దరికే పరిమితం. నిజానికి అక్కడ ఇద్దరికి కూడా చోటు లేదు. అది ఇద్దరు ఒకరిగా మారి, చివరికి ఏ ఒక్కరూ మిగలని బాధానుభవం. నారాయణప్పతో ఆమెకి ఆ తరువాత సంభవించింది ఏథెన్సు నగరానికి సంభవించినటువంటిది. అది ప్రేమ తాలూకు అత్యున్నత స్థాయి.
