ఆడినడయాడు పాపా

అది సుబ్రహ్మణ్య భారతి గీతమని అప్పుడే తెలిసింది, అదే మొదటిసారి వినడం కూడా. ఆ తర్వాత ఆ గీతాన్ని పూర్తిగా ఇంగ్లిషు అనువాదంలో చదివినప్పుడు నా మనసంతా ఆర్ద్రమైపోయింది. ఒక పసిపిల్లవాడు మరొక పసిపిల్లవాడితో మాట్లాడినట్టుగా భారతియారు ఈ పాట రాసాడనిపించింది.