డొక్కాసీతమ్మా, పండిత రాయలూ

మునిఖండంగా స్థానికులు పిలుచుకునే ముంగండ గురించి చాలా కాలం కిందట భమిడిపాటి జగన్నాథరావుగారు ఒక మాట చెప్పారు: 'అక్కడి బ్రాహ్మణులు అటు వేదమూ, ఇటు కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా సమానంగా అధ్యయనం చేసినవాళ్ళు ' అని.

కాని తెలుగు?

సాహిత్య భాషగా తెలుగు ప్రపంచంలోని అత్యుత్తమమైన పదిభాషల్లో ఒకటి. ఆ విషయంలో దిగులు లేదు. నేను మాట్లాడుతున్నది శాస్త్ర, సాంకేతిక భాషగా, సామాజిక శాస్త్రాల భాషగా తెలుగు వికసించవలసిన అవసరం గురించి.

75 సంవత్సరాలు

అక్కడ ఇండియా ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒకే ఒక్క మతం అంతకన్నా కాదు. అక్కడ ఇండియా ఒక టీం, ఒక ఉమ్మడి భావన, వ్యక్తి తనని తాను వెనక్కి నెట్టుకుని తనొక బృందంగా మారే క్రమశిక్షణ, సంస్కారం, సంస్కృతి.