వి చూస్తే తప్ప చెప్పలేని మాట. నేను కారకపర్రు వెళ్ళినరోజున ఆ గాలినీ, ఆ ఆకాశాన్నీ చూసానుగానీ, దానికి తగ్గ మాట ఇప్పుడు స్ఫురిస్తున్నది. సమీర విధూతం అనే మాటవినగానే క్షాళిత సమీరం అనే మాట స్ఫురిస్తున్నది. ఆ రోజు ఆ గాలి ప్రక్షాళిత సమీరం, ఆ ఆకాశం శుభ్రధౌత గగనం.
మార్దవ సంవేదన
ఆ పుస్తకం మొత్తం చదివేటప్పటికి, హైని నిజంగా ప్రేమించింది ఒకే ఒక్కరిని, అది జర్మన్ భాషని మాత్రమేనని అర్థమయింది. ఇక జడ్జిగారు నన్ను లోపలకి పిలిచేటప్పటికి నేను కూడా తెలుగు భాషని ప్రేమించడమెట్లా అన్న ఊహల్లో తేలిపోతూ ఉన్నాను.
ప్రియసన్నిధి
ఆధునిక మానవుడు స్వభావరీత్యా Faustian. కానీ, ఆ సంక్షుభిత, సందిగ్ధ మానవుడి అంతరంగంలో ఒక lyrical మానవుడున్నాడని గొథేని చదివితేనే అర్థమవుతుంది. అందుకనే గొథే రచనలన్నీ అదృశ్యమయినా కూడా ఆయన గీతాలొక్కటీ చాలు, ఆయన్ని మహాకవిగా గుర్తించడానికి అన్నారు విమర్శకులు.
