శతాబ్దాలకిందటి ఏ పారశీక కళాకారులో, చిత్రకారులో అతడితో నిత్యం సంభాషణ కొనసాగిస్తూ ఉంటారనుకుంటాను. ఇక్కడ పొందుపరిచిన రెండుమూడు నమూనాలు చూడండి. ఆ నెమలి, ఆ ఏనుగు, ఆ కొంగలు- ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కావు, చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకాచెప్పాలంటే పాలరాతిమీద ముద్రించిన మనోజ్ఞస్వప్నాలు.
తాళ్ళపాక
సాహిత్యం అందించగల అత్యుత్తమ రసానుభూతి మన హృదయాల్లో సాత్త్వికోదయం కలిగించడమే అయితే ఇంతకుమించిన గొప్ప సాహిత్యం మరొకటిలేదు. అప్పుడే రేకులు విప్పిన ఎర్రతామరపూవులోని లాలిత్యంలో, ఊపిరిసోకితేనే కందిపోతుందేమోననేటంత సౌకుమార్యంలో ముంచి తీసిన గీతమిది.
వీరవాక్యం
సిద్ధకవులు, నాథకవులు, చర్యాగీతకవులు, బుల్లేషా, కబీరు వంటి సూఫీకవుల గురించి తెలుసుకున్న ఎంతో కాలానికి గాని నా ఇంటిపెరడులోనే నెలకొన్న చింతామణిని గుర్తించలేకపోయాను. తక్కిన తెలుగు గీతకవులంతా ఒక ఎత్తూ, వీరబ్రహ్మం ఒక్కడూ ఒక ఎత్తు.
