నాకు అప్పుడు బడి అంటే భవనమనీ, సదుపాయాలనీ ఆలోచన లేదనిపిస్తుంది. బడి అంటే మా వజ్రమ్మ పంతులమ్మగారు. అంతే. ఆమెని చూసే చింగిజ్ అయిత్ మాతొవ్ 'తొలి ఉపాధ్యాయుడు' పుస్తకం రాసి ఉంటాడు. ఆమె నేను చూసిన పరిపూర్ణ క్రైస్తవురాలు. కాని నాకు రామాయణం, మహాభారతం చెప్పిన తొలి గురువు కూడా ఆమెనే.
మేలిమి సభలు
ఆ రోజు అచ్చంగా ఆరుగురమే ఉన్నాం. అది నా జీవితంలో నేనింతదాకా హాజరైన కవిత్వావిష్కరణ సభల్లో మరీ మేలిమి సభల్లో ఒకటని మరో మారు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
కృపావర్షధార
ఈశ్వరుడి ప్రేమ పొలంలో దాచిపెట్టిన నిధినిక్షేపం లాంటిది. అది ఎవరి కంటపడిందో, దాన్నతడు మరింత భద్రంగా దాచుకుంటాడు. తనకున్న గొడ్డూగోదా సమస్తం అమ్మేసుకుని మరీ ఆ మడిచెక్క తన సొంతం చేసుకుంటాడు.
