కబీరు-2

కబీర్ కవిత్వం ప్రధానంగా మూడు ఆధారాలనుంచి లభించింది. ఒకటి, నానక్ సేకరించి 'ఆదిగ్రంథం'లో సంకలనం చేసిన కొన్ని దోహాలు, పదాలు. మరొకటి తూర్పు ప్రాంతాల్లో కబీర్ పంథీయులు ఒక పవిత్రగ్రంథంగా పరిగణిచే 'బీజక్', మూడవది, రాజస్థాన్ ప్రాంతం నుంచి సేకరించిన కబీర్ రచనావళి.

కబీరు-3

అది అన్నిటికన్నా ముందు ప్రేమ. ప్రేమావస్థ, మనుషుల మధ్యనైనా, మనిషికీ, భగవంతుడికీ మధ్యనైనా ఒక్కలానే ఉంటుంది. కాకపోతే మనుషుల మధ్య ప్రేమ స్థిరం కాకపోవచ్చు. కానీ, ఆ ప్రేమ కలిగిన క్షణాన, ఒక మనిషి మరొక మనిషి పట్ల లోనుకాగల పారవశ్యానికీ, భగవత్ప్రణయ పారవశ్యానికీ మధ్య తేడా ఏమీ ఉండదు.

కబీరు-4

బీజక్ లో కనబడే కబీర్ చాలా సూటి మనిషి. అందులో ఆయన తనతో తాను మాట్లాడుకోడు, లేదా దేవుడితోనో, రాముడితోనో మాట్లాడడు. నేరుగా తన కాలం నాటి సాధువుల్ని, సంతుల్ని, సజ్జనుల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. చాలాసార్లు పండితుల్ని,కాజీల్ని రెచ్చగొడతాడు, ప్రశ్నిస్తాడు, ఎండగడతాడు.

Exit mobile version
%%footer%%