కాని ఆ గంభీరస్వరం, ఆ పద్యం, 'దొరవారూ' అంటూ పిలిచే ఆ పిలుపు మాత్రం మళ్ళీ వినబడలేదు, వినబడదన్న ఊహనే తట్టుకోవడం ఏడాది కింద ఎంతో కష్టంగా ఉండింది.
సుకృతుడు
ప్రాచీన కూచిపూడి యక్షగానకర్తల కోవలోకి కవితాప్రసాద్ కూడా చేరిపోయాడు. ఒక వక్త అన్నట్టుగా, బహుశా, వాళ్ళంతా ఇప్పుడు ఇంద్రసభలో ఈ నాట్యం గురించే మాట్లాడుకుంటూ ఉండవచ్చు.
