పెద్దలు నౌడూరి మూర్తి గారు తన అనువాదలహరి బ్లాగుద్వారా దేశదేశాల కవిత్వాన్ని తెలుగులోకి తెస్తూండటమే కాక, తెలుగు కవిత్వాన్ని కూడా ఇంగ్లీషులోకి అనువదిస్తూ ఉన్నారు. నిస్వార్థంగా ఒక తపసుగా చేస్తూ వచ్చిన ఆ కృషిలో ఆయన ఇంతదాకా అనువదించిన సుమారు 200 తెలుగు కవితల్ని Wakes on the Horizon పేరిట సంకలనంగా వెలువరించారు
షానామా-మహాభారతం
ఇంకా లోతుగా పరిశీలిస్తే షానామా, మహాభారత ఇతిహాసాలు నిర్మాణసూత్రంలోను, కథాగమనంలోను, తాత్త్వికసందేశంలోను, సాంస్కృతిక జీవధారలోను ఏదో ఒక అనిర్దిష్టము, అతిప్రాచీనము, ఏకీకృతము అయిన సమానలక్షణం ఉందని భావించే అవకాశం ఉంది
దేవుడా నేనేమి చేసేది
బాబా బుల్లేషా కవిత్వం చదువుతూ ఉండగా,ఈ కవిత దగ్గరకు రాగానే హృదయం కంపించడం మొదలయ్యింది. ఇంగ్లీషు లోనే ఈ వాక్యాలు నా చెవిలో ఎవరో తుత్తార ఊదినట్టుగా నన్ను నా నిద్రలోంచి ఒక్కసారిగా గుంజి బయటకు లాగేసాయి.
