వజ్రయానాన్ని విమర్శిస్తూ కబీరు రాసిన కవిత ఏదన్నా ఉందా అంటూ భాస్కర్. కె అడిగిన తరువాత, నేను మరికొంత అధ్యయనం చేయవలసి వచ్చింది. చూడగా, చూడగా కబీరు వజ్రయానులకి చాలానే ఋణపడి ఉన్నాడని అర్థమయింది.
కబీరు-12
చాలా రోజుల తర్వాత మళ్ళా కబీరుని తెరిచాను. ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. అటువంటి స్పష్టత ఒకటుందని తెలియడమే ఒకింత ఊరట ఈ జీవితానికి.
నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు
మిత్రులారా, మీ దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నా,అత్యద్భుతమైన పుస్తకాలు దొరికే చోటు నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు. అక్కడ కురతలైన్ హైదర్ రాసిన 'అగ్నిధార' దొరుకుతుంది. కురతలైన్ అగ్రశ్రేణి ఉర్దూ రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త.
