మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం ఏది? ఈ ప్రశ్న మనల్ని ఎవరో ఒకరు అడిగే ఉంటారు. కొంతమంది తాము చదివిన పుస్తకాల్లో ఫలానా పుస్తకం చదవడం వల్లనే తమ జీవితం గొప్ప మలుపు తిరిగిందని చెప్పగలుగుతారు. బుచ్చిబాబు రస్సెల్ పుస్తకాన్ని పేర్కొన్నట్టు.
కొంగలు
సోవియెట్ రష్యా సజీవంగా ఉన్న రోజుల్లో, సోవియెట్ సాహిత్యం విస్తారంగానూ, చౌకగానూ లభ్యమయ్యే రోజుల్లో, నా చేతుల్లోకి వచ్చిన ఇద్దరు కకేషియన్ కవుల అద్భుతమైన కవిత్వం నేను మరవలేను. ఒకరు కైసెన్ కులియెవ్ అనే బల్కార్ కవి, మరొకరు రసూల్ గంజాతొవ్ అనే అవార్ కవి.
కొత్త రక్తం ఎక్కించిన కవి
రెండు రోజుల కిందట రష్యన్ కవి, రచయిత, చలనచిత్రకారుడు యెవెగ్నీ యెవెతుషెంకొ (1933-2017) అమెరికాలో ఓక్లహోమాలో కన్నుమూయడంతో ఇరవయ్యవశతాబ్ది రష్యన్ మహాకవుల్లో చివరి తరం దాదాపుగా అదృశ్యమైపోయింది.
