కాఠజోడి నది ఒడ్డున

వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరు మొదటిసారి చాలా ఏళ్ళ కిందట స్మైల్ గారి దగ్గర విన్నాను. కాని వారితో పరిచయం లేదు. ఈ మధ్య ఆయన తానొక ఒరియా కవిని తెలుగు చేసాననీ, ఆ అనువాదం మీద నా అభిప్రాయం చెప్పమనీ అడిగారు.

చెట్టును దాటుకుంటూ

జూకంటి జగన్నాథం ముఫ్ఫై ఏళ్ళకు పైగా నా మిత్రుడు. నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతానికి వచ్చిన మొదటి మనియార్డరు అతణ్ణుంచే. ఇప్పటిదాకా అచ్చయిన తన ప్రతి కవితా సంపుటీ నాకు పంపిస్తూ ఉన్నాడు, మూడు సమగ్ర సంపుటాలతో సహా.

ఆ వేణువు నా చుట్టూ

ఈ సారి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో నా కోసం కొత్త కవిత్వం తీసుకొచ్చాడు అనల్ప పబ్లికేషన్స్ బలరామ్. చైనా నుంచి గ్రీసుదాకా మూటగట్టుకొచ్చిన ఆ కవిత్వంలో, అన్నిటికన్నా ముందు నేను తెరిచిందీ, అక్కడే నిలిచిపోయిందీ రాబర్ట్ వాల్సర్ Thirty Poems (న్యూ డైరక్షన్స్, న్యూయార్క్, 2011).