అట్టిలా జోసెఫ్

అందరూ తమ తల్లులకి వందనమిచ్చే ఈ రోజు, నాకొక తల్లీ, కొడుకూ గుర్తొస్తున్నారు. ఆ కొడుకు, అట్టిలా జోసెఫ్ (1905-1937). ఆధునిక హంగేరియన్ సాహిత్య వైతాళికుడు, ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవులందరి మూగగొంతులకీ తన గరళకంఠాన్ని అందించిన కవి. 

మూడు ఉదాహరణలు

ఈ ఏప్రిల్ 23 షేక్స్పియర్ 400 వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయన్ను ఘనంగా తలచుకుంది. ఆ రోజే బండి శ్రీహర్షగారు నాకో మేసేజి పెట్టారు, 'షేక్స్పియర్ రసజ్ఞతని మరోమారు గుర్తు చేయరూ ఇవాళ ' అంటో.

దుఃఖమూ, సంతోషమూ

నా చిన్నప్పుడు మా ఊళ్ళో కంసాలి సోమలింగం బంగారపు పని చేస్తుంటే చూసేవాణ్ణి. ప్రతి చిన్న బంగారపు తునకనీ, గాలి వీయకుండానే ఎగిరిపోయేటంత పలచని బంగారు రేకుల్ని వేళ్ళతొ దారాలు అల్లినట్టుగా, శ్రద్ధగా, పసిపాపల్ని లాలించినంత జాగ్రత్తగా అతికేవాడు, పొదిగేవాడు. అట్లాంటి కవితా శిల్పం మార్టిన్ సన్ ది.