కొన్ని పుస్తకాలు మనదగ్గర చాలాకాలంగా ఉన్నా సమయం వచ్చినప్పుడు కాని మన దృష్టివాటిమీదకి పోదు. గత కొన్నాళ్ళుగా చెప్పలేని మనోవేదనని అనుభవిస్తున్న నాకు నా అల్మైరాలో చాలాకాలంగా నా చేతులకోసం ఎదురుచూస్తున్న పుస్తకమొకటి కనబడింది.
నేను కవినెట్లా అయ్యాను
జరొస్లావ్ సీఫర్ట్ చెక్ కవి. 1984 లో కవిత్వానికి గాను నోబెల్ పురస్కారం పొందాడు. ఆయన కవిత్వానికి The Poetry of Jaroslav Seifert (1998) పేరిట ఎవాల్డ్ ఓసెర్స్ చేసిన అనువాదంలో కొన్నాళ్ళుగా మునిగితేలుతున్నాను. ప్రతి రాత్రీ నిద్రలోకి జారుకునేముందు ఒకటిరెండు కవితలేనా చదవడం కొత్తసుగంధాల్నీ, పాతప్రణయాల్నీ మరొకసారి చేరదీసుకోవడం లాగా ఉంది.
యాంటిగని
0 టివి ప్రేక్షకులకోసం ప్రతి ఆదివారం అక్షరం కార్యక్రమంలో ( మ. 12.30 కి ) ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఒక వారం కవిత్వం,ఒక వారం నవల, ఒకవారం నాటకం ఇట్లా. ఈసారి సోఫోక్లిస్ రాసిన 'యాంటిగని ' నాటకాన్ని పరిచయం చేసాను.
