శిలలలో మెడొనా

నిన్న సాయంకాలం ఆదిత్య మా ఆఫీసుకి వచ్చాడు. అతడు బాగులోంచి ఆగమగీతి బయటకు తీస్తుండగానే గుర్తొచ్చింది, బైరాగి (1925-79) పుట్టినరోజని. ముఫ్ఫై ఏళ్ళకిందట నేను బైరాగి కవిత్వాన్ని ఆరాధించినదానికన్నా అతడిప్పుడా కవిత్వాన్ని మరింత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు.

ఒంటరి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి గురించి విన్నానుగాని, ఒకటి రెండు కథలు మినహా, ఆయన రచనలేమీ నేను చదవలేదు. ఇప్పుడు తానా నవలలపోటీలో బహుమతి పొందిన ఆయన నవల 'ఒంటరి' చదువుదామనుకుంటూ ఉండగానే మిత్రులు గజేంద్రనాథ్ గారు హన్స్ ఇండియాలో తాను రాసిన వ్యాసం ఒకటి నాకు పంపించారు.

రామాయణ పర్వతశ్రేణి

మీకు కొండలంటే చాలా ఇష్టమల్లే ఉందనుకుంటాను అన్నారు గణేశ్వరావుగారు, నా 'కొండమీద అతిథి' పుస్తకం చూసి. 'అవును, మాది కొండ కింద పల్లె' అని ఒకింత గర్వంగానే చెప్పాను గాని, ఆ వెంటనే సిగ్గుపడ్డాను కూడా. నిజంగా కొండల్ని ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నానా నేను?