వాల్మీకి నుంచి టాగోర్ దాకా భారతీయ కావ్యవాక్కుకి ప్రాణం పోసిన సరస్వతి వేదవాక్కు. అనుభవాన్ని అక్షరంగా మార్చే విద్య వేదఋషులకి తెలిసనట్టుగా మరెవరికీ తెలియదేమో. వేదాన్ని రహస్యవిద్యగానూ, బ్రహ్మవిద్యగానూ సాధారణ పాఠకుడికి అందకుండా చేసినందువల్ల మనం ఇప్పటికే సాంస్కృతికంగా ఎంతో నష్టపోయాం
పూలు వికసిస్తున్నాయి, వాడిపోతున్నాయి
ప్రాచీన చీనా కవిత్వంలో అద్భుతమైన కవిత్వం చెప్పిన కవయిత్రులున్నారు. కాని ప్రసిద్ధి చెందిన కవితాసంకలనాల్లో వాళ్ళ కవితలు చేరనందువల్ల బయటి ప్రపంచానికి వాళ్ళ గురించి ఎక్కువ తెలియలేదు. చీనా కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మొదటితరం అనువాదకులు కూడా ప్రసిద్ధి చెందిన కవులమీదనే ఎక్కువ దృష్టిపెట్టారు.
కొండదిగువపల్లెలో
బాల్యం నుంచి నవయవ్వనంలో అడుగుపెట్టేటప్పుడు ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు అదృశ్యమైపోతుందో తెలియని తొలిప్రేమలాంటిది వసంతకాలం. వస్తున్న జాడ తెలుస్తుందిగాని ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మనం మేలుకునేటప్పటికి వేసవి వేడి చుట్టూ వరదలెత్తుతుంది, ఇంతలోనే తొలి ఋతుపవనం మన ఆకాశాన్ని కమ్మేస్తుంది.
