రెండుపాటలు

ఇట్లాంటి ఫాల్గుణమాసాన్ని ఎన్నడూ చూడలేదు. ఇట్లా వసంత ఋతువునూ ఎప్పుడూ స్వాగతించి ఉండలేదు. అకాలంగా కాస్తున్న ఈ ఎండ, 'శిశిరవసంతాల మధ్య సంభవించే మహామధురమైన మార్పు ' ను అనుభూతిచెందటానికి వీల్లేనంత దట్టమైన తెరకప్పేసింది. 

జెండా కొండ

ఆదివాసులకి కొండ ఒక అఖండ జీవపదార్థమని నా మిత్రుడూ, గిరిజన సాహిత్యవేత్తా డా.శివరామకృష్ణ రాసాడు. 'పండితారాధ్య చరిత్ర''లో 'పర్వత ప్రకరణం'లో శ్రీశైలం గురించి రాస్తూ, 'అకృతాత్ములకు శిలా నికరమై తోచు/సుకృతాత్ములకు లింగ నికరమై తోచు 'అన్నాడు పాల్కురికి సోమన.

రెండువారాల పాటు మా ఊళ్ళల్లో

చాలా కాలం తర్వాత రెండువారాల పాటు మా ఊళ్ళల్లో తిరుగాడేను.నేను పుట్టిన ఊరితోనూ, ఆ ప్రాంతంతోనూ నేను మానసికంగా ఎంతగా అతుక్కుపోయేనంటే,నేను మరేదీ కోరుకోలేకపోయాను. విద్యలోనూ, ఉద్యోగంలోనూ బహుశా ఏదైనా సాధించిగలిగి ఉండేవాణ్ణేమోగాని, ఎప్పటికప్పుడు నా హోం సిక్ నెస్ నన్ను వెనక్కి లాగేస్తూనే వచ్చింది.