బసవ పురాణం-5

తెలుగు పాఠకుల్లో కూడా చాలామందికి రూమీ గురించి తెలిసినంతగా సోమన గురించి తెలియదు. కాని కావ్యనిర్మాణ పద్ధతుల్లోగాని, కథనశైలిలోగాని, ఈశ్వరదర్శనం ఏ కొద్దిమంది పండితులకో కాకుండా ప్రజలందరికీ సుసాధ్యమేనని నమ్మడంలోనూ, చెప్పడంలోనూ కూడా సోమన, రూమీ ఒక్కలాంటివారేనని చెప్పడం ఈ రోజు ప్రసంగం ముఖ్యోద్దేశం.

వర్డ్స్ వర్త్ కవితానుశీలన

ఆయన వ్యాసం నాకొక కనువిప్పు. ఈ పద్ధతిలోనే మన కవుల కవిత్వాన్ని కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా, మమ్మటుడు 'కావ్యప్రకాశం' లో పేర్కొన్న పద, వాక్య, అర్థ దోషాల నుంచి మన కవులు ఎట్లా తప్పించుకోలేకపోతున్నారో చూడవచ్చు