ఒక తేనెటీగకి ఎంత గూడు కావాలి?

నాకు ఇల్లొక్కటే చాలదు, పుస్తకాలు కావాలి, ప్రతి సాయంకాలం, ఇంటి అరుగుమీద, ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోడానికి ఒక మిత్రబృందం కావాలి. మేము మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి వచ్చిన నక్షత్రాలతో ఆకాశం కిక్కిరిసిపోవాలి.

పాలపళ్ళ వాగు

చాలాకాలంగా ఎదురుచూస్తున్న తావో యువాన్ మింగ్ 'సెలెక్టెడ్ పొయెమ్స్'(పండా బుక్స్, 1993) నిన్ననే వచ్చింది. సుమారు ముఫ్ఫై కవితలు, గతంలో చాలా సంకలనాల్లో చాలా సార్లు చదివినవే. కాని విడిగా ఒక పుస్తకంగా చూసినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది కదా.