కాని ఆ యథార్థసౌందర్యాన్ని చూడటానికి కళ్ళుండాలేగాని, ఆ దివ్యసౌందర్యం, ఆ నిర్మల, స్ఫటికస్వచ్ఛసౌందర్యం- మర్త్యత్వపు మాలిన్యాలంటని, మానవజీవితపు వన్నెచిన్నెలు, హంగుపొంగులు దరిచేరలేని ఆ సౌందర్యాన్ని చూడటానికి నోచుకోగలిగితే, సదా ఆ సరళ, సత్య, దివ్యసౌందర్యంతోటే సంభాషిస్తో ఉండిపోగలిగితే!'
ప్రేమగోష్ఠి-8
అది కూడా వివరిస్తాను సోక్రటీస్. ఇప్పటిదాకా ప్రేమ ప్రాదుర్భావం గురించి చెప్పాను. ప్రేమ ఒక సౌందర్యదాహం అని నువ్వు కూడా ఒప్పుకున్నావు. కాని ఎవరేనా అడగొచ్చు: సౌందర్యదాహం, నిజమే, కాని ఎవరి సౌందర్యం పట్ల? సోక్రటీసులోనా, లేక డయొటిమాలోనా? లేదా మరోలా అడగాలంటే, ఒక మనిషి అందాన్ని ప్రేమిస్తున్నప్పుడు, అతడు కోరుకుంటున్నదేమిటి?
ప్రేమగోష్ఠి-7
అంటే, సౌందర్యాన్ని కోరుకుంటున్నప్పుడు ప్రేమ మంచితనాన్ని కూడా కోరుకుంటున్నట్టేనా? 'నీ మాటలు ఖండించలేను సోక్రటీస్, సరే, నువ్వన్నట్టే అనుకుందాం' అన్నాడు అగధాన్. 'ప్రియమిత్రమా, నువ్వు చెప్పవలసిన మాట అది కాదు, ఇది: నేను సోక్రటీస్ ని ఖండించగలనేమోగాని, సత్యాన్ని ఖండించలేను'అని చెప్పు.
