పుస్తక పరిచయం-17

పుస్తక పరిచయం ప్రసంగాల పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం మీద చేస్తున్న ప్రసంగాల్లో ఇది ఏడవది. ఈ రోజు ప్రసంగంలో టాగోర్ రష్యా సందర్శన సందర్బంగా రాసిన ఉత్తరాల గురించీ, విద్య, గ్రామ పునర్నిర్మాణాల గురించీ ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల గురించీ కొంత వివరంగా చర్చించాను.

పుస్తక పరిచయం-16

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఆరవది. ఈ రోజు టాగోర్ కవిత్వ సంపుటి 'బలాక' (1914) పైన ప్రసంగించాను.

రెండు కవితలు

ఈ చిన్నారి హృదయాన్ని ఆశీర్వదించండి. నింగి నుంచి నేలకు ముద్దులు మూటగట్టిన ఈ చిట్టి తండ్రిని దీవించండి. వీడికి సూర్యుడి కాంతి అంటే ఇష్టం. వాళ్ళమ్మనే చూస్తూ ఉండటం ఇష్టం.